వర్క్‌ఫ్లో టూల్‌లు

మీ ఆలోచనా విధానాన్ని సులభతరం చేయండి

ఫీచర్ చేస్తున్నవారు. @omgadrian

కంటెంట్‌ను సేవ్ చేయడం, స్టిక్కీలతో గమనికలు వ్రాయడం, అలాగే మరెన్నో చేయడం ద్వారా మీ సృజనాత్మక ప్రేరణను ఒకే చోట సులభంగా నిర్వహించడం, మళ్లీ సందర్శించడంలో Editsలోని ఆలోచనలు ట్యాబ్ మీకు ఎలా సహాయపడుతుందో కనుగొనండి.

@omgadrian ఆలోచనల గురించి మాట్లాడుతున్నారుPlay Icon

Instagram నుండి సేవ్ చేసిన మీ కంటెంట్‌తో సహా మీ ఆలోచనలు, ప్రేరణను సమర్థవంతంగా మళ్లీ సందర్శించండి.

గమనికలు, ప్రేరణ విషయాలు, స్క్రిప్ట్‌లు, మరిన్నింటిని గమనించేందుకు స్టిక్కీలను ఉపయోగించండి.

క్రియేట్ చేసే సమయం వచ్చినప్పుడు సులభంగా యాక్సెస్ చేసేందుకు మీకు అవసరమైన అన్ని అంశాలను ఒకే చోట కలిగి ఉండండి.

మీకు ఎప్పుడైనా విపరీతమైన ఆలోచనలు వచ్చి, ఆ తర్వాత అన్నింటినీ మర్చిపోయిన అనుభవం ఉందా? లేదా మీరు ఆ విషయాన్ని ఎక్కడో వ్రాసుకున్నట్లు గుర్తు పెట్టుకున్నారు, కానీ ఎక్కడ వ్రాసారో గుర్తులేదా?

అదృష్టవశాత్తూ, Edits మీ ఆలోచనలను, అలాగే మీకు ఉత్తేజాన్ని కలిగించే కంటెంట్‌ను ట్రాక్ చేయడాన్ని మీకు సులభతరం చేస్తుంది.

Edits, మీ ఫోన్‌లో అద్భుతమైన వీడియోలను క్రియేట్ చేసేందుకు మీకు కావలసిన ఒకే ఒక్క యాప్.

[0:17] మీరు సేవ్ చేసిన ప్రేరణను యాక్సెస్ చేయడం ప్రారంభించడానికి ఇక్కడ ఉన్న ఆలోచనలు ట్యాబ్‌కు వెళ్లండి, ఇందులో మీరు Instagramలో సేవ్ చేసిన కంటెంట్ కూడా ఉంటుంది.

[0:22] మీకు ప్రేరణ కలిగించే అంశాలకు గమనికలను యాడ్ చేయడం, వీడియో కోసం రఫ్ కట్‌ను గీయడం వంటి అన్ని రకాల అవసరాల కోసం మీరు స్టిక్కీల ఫీచర్‌ను కూడా ఉపయోగించవచ్చు.

[0:31] ఆపై మీరు మీ స్టిక్కీలు, సంగీతం లేదా ఎఫెక్ట్‌ల వంటి సేవ్ చేసిన ప్రేరణను నేరుగా మీ ప్రాజెక్ట్‌లలోకి తీసుకురావచ్చు, తద్వారా మీ రెఫరెన్స్‌లు మీ చేతి వద్దే ఉంటాయి.

మీ ఆలోచనా విధానాన్ని ట్రాక్ చేయడంలో, నిర్వహించడంలో సహాయంగా Edits ఈ అద్భుతమైన ఫీచర్‌లన్నింటితో అందించబడింది, కాబట్టి మీరు క్రియేట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పుడు మరింత నమ్మకంగా ఉండవచ్చు.