కెమెరా టూల్‌లు

మెరుగైన నాణ్యతతో చిత్రీకరించండి

ఫీచర్ చేస్తున్నవారు. @omgadrian

రాజీ పడకుండా నాణ్యమైన వీడియోను చిత్రీకరించండి. గరిష్టంగా 4K లేదా HDRలో షూట్ చేసి, మీ డివైజ్ సపోర్ట్ చేసే అత్యధిక రిజల్యూషన్‌లో ఎగుమతి చేయండి.

@omgadrian కెమెరా టూల్‌ల గురించి మాట్లాడుతున్నారుPlay Icon

HD, 2K, 4K లేదా HDRలో షూట్ చేసి, మీ ఫ్రేమ్ రేట్‌ను ఎంచుకోండి. మీరు ఏదైతే చిత్రీకరించారో అదే ఎగుమతి అవుతుంది — నాణ్యత అనేది క్యాప్చర్ నుండి అప్‌లోడ్ వరకు స్థిరంగా ఉంటుంది.

మీ ఫుటేజ్‌ను మెరుగుపరిచే అంతర్నిర్మిత టూల్‌లు. సోలో షూట్‌ల కోసం కౌంట్‌డౌన్ టైమర్, టాకింగ్ హెడ్‌ల కోసం టచ్-అప్, అలాగే కొనసాగించే ముందు పరిశీలించాల్సిన క్లిప్ ప్రివ్యూ.

మీ ఫోన్ కెమెరా, ఎడిటింగ్ యాప్ మధ్య ఇకపై టోగుల్ చేయాల్సిన అవసరం లేదు. Edits అనేది క్రియేటర్‌లు వాస్తవంగా చిత్రీకరించే విధానానికి అనుగుణంగా రూపొందించిన కెమెరాను వారికి అందిస్తుంది, అలాగే దాన్ని సులభంగా ఎడిటింగ్ టైమ్‌లైన్‌కు తీసుకువస్తుంది.

"మీకు కొత్త కెమెరా అవసరం లేదు. మీకు Edits యాప్ మాత్రమే అవసరం. Editsలో మెరుగైన కెమెరాను తక్కువ అంచనా వేయకండి. నా అభిప్రాయం ప్రకారం, మీ ఫోన్‌తో చిత్రీకరిస్తున్నప్పుడు మీరు స్థిరంగా ఉపయోగించాల్సిన ఉత్తమ ఫీచర్‌లలో ఇది ఒకటి. Edits — మీ ఫోన్‌లో అద్భుతమైన వీడియోలను క్రియేట్ చేసేందుకు మీకు కావలసిన ఏకైక యాప్, అలాగే మీరు ఒకే యాప్‌లో ఉండగానే సులభంగా పని చేయవచ్చు, కెమెరాను ప్రత్యేకించి క్రియేటర్‌ల కోసం రూపొందించినందున మీరు ముందుకు వెనుకకు టోగుల్ చేయవలసిన అవసరం ఉండదు. మరింత నియంత్రణ, మెరుగైన విజువల్స్ కోరుకునే వ్యక్తులు.

[ 0:22 ] మీరు ఏ రకమైన వీడియో కంటెంట్‌ను క్రియేట్ చేసినప్పటికీ, Edits ఈ కెమెరా నియంత్రణలను కాన్ఫిగర్ చేయడాన్ని సులభతరం చేస్తుంది. మీ ఫుటేజ్‌ను రికార్డ్ చేయడం ప్రారంభించడానికి, అలాగే మీ రిజల్యూషన్‌పై పూర్తి నియంత్రణను కలిగి ఉండటానికి మీరు ఇక్కడ ఉన్న Editsలోని కెమెరాకు వెళ్లవచ్చు. అంటే, మీరు మళ్లీ ఎప్పుడూ మీ షూటింగ్ నాణ్యతలో రాజీ పడాల్సిన అవసరం ఉండదు. మీరు మీ డివైజ్ ఆధారంగా HD, 2K, 4K లేదా HDRలో చిత్రీకరించడం మధ్య సులభంగా మారవచ్చు.

ఒక సెకనుకు ఎన్ని ఫ్రేమ్‌లు ఉండాలో ఎంచుకునే వెసులుబాటు కూడా మీకు ఉంటుంది, అలాగే మీరు ఎగుమతి చేసినప్పుడు కూడా చిత్రీకరిస్తున్నప్పుడు ఉన్న నాణ్యతే మీరు అప్‌లోడ్ చేసినప్పుడు కూడా అలాగే ఉంటుందని తెలుసుకుని మీరు నిశ్చింతగా ఉండవచ్చు. నాకు నచ్చని విషయం ఏమిటంటే, నేను గొప్పగా కనిపించే దేన్నైనా చిత్రీకరించి, ఎడిటింగ్‌ని పూర్తి చేశాక, దాన్ని ఎగుమతి చేసి, అప్‌లోడ్ చేసే సరికి అది ఏదో నాసిరకంగా షూట్ చేసినట్లు కనిపిస్తోంది.

[ 1:00 ] కెమెరాలో మరొక గొప్ప ఫీచర్ టైమర్. మీరే షూట్ చేస్తున్నప్పుడు, మీరు మీ షాట్‌ను ఫ్రేమ్ చేసుకోవాలి, రికార్డ్ ఎంపికను నొక్కాలి, ఆపై కెమెరా ముందుకు రావాలి. Editsతో, మీరు ఇక్కడే కౌంట్‌డౌన్ టైమర్‌ను సెట్ చేయవచ్చు. నేను నా ఫ్రేమ్‌ను సెట్ చేయడం, టైమర్‌ను ఎంచుకోవడం, అందులోకి ప్రవేశించడం, అంతే అయిపోయింది చూడండి. మీకు అవసరమైనప్పుడు మాత్రమే రికార్డింగ్‌ను ప్రారంభించండి. అదే విధంగా, మీకు అవసరం లేని బిట్‌ల కోసం ఫోన్ స్టోరేజ్‌ను వృథా చేయవలసిన అవసరం లేదు.

[ 1:24 ] ఇక్కడ ఉన్న టచ్-అప్ ఫీచర్ మీ టాకింగ్ హెడ్ వీడియోలకు మరింత మెరుగుదలను సులభంగా తీసుకురావడానికి ఒక త్వరిత మార్గం. అలాగే చివరిది కానీ ముఖ్యమైనది, క్లిప్ ప్రివ్యూ కార్యాచరణ అనేది ఒక అద్భుతమైన చిట్కా. మీ షాట్‌ను రికార్డ్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న క్లిప్‌లపై ట్యాప్ చేయండి, ఆపై మీరు ముందుకు కొనసాగాలనుకుంటున్నారా లేదా అని నిర్ణయించుకునే ముందు మీ క్లిప్ ప్రివ్యూను చూడవచ్చు. ఇది సహాయకరంగా ఉంటుందని ఆశిస్తున్నాము. Edits కెమెరాను ప్రయత్నించి చూడండి."